Back to News
EducationJune 6, 2026

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Speaks at The Hindu Huddle 2026: India in Dialogue by The Hindu in Bengaluru.

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఆయా రంగాల్లో స్కిల్స్ Skills పెంచుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్ లు పోతున్నాయని అందరూ ఆందోళన చె

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఆయా రంగాల్లో స్కిల్స్ Skills పెంచుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్ లు పోతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. వైట్ కాలర్ జాబ్ ల కు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్. యువతరం వాటిపై దృష్టి సారించాలి. అందుకు అవసరమైన స్కిల్స్ పెంచుకోవాలి” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

✅ ది హిందూ #TheHindu దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ది హిందూ డైరెక్టర్ ఎన్. రామ్ గారు అడిగిన తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ, సామాజిక, పరిపాలనా, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు విడమరిచి చెప్పారు.

✅ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళనకర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా యువతలో నైపుణ్యం పెంచడానికి తెలంగాణలో అనేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాత పాత సిలబస్ తో మూస పద్ధతిలో కొనసాగుతున్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ATC)లుగా అప్ గ్రేడ్ చేసిన విషయాలను చెప్పారు.

✅ తెలంగాణ సమగ్రాభివృద్ధికి రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనికత, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగడానికి నిర్దేశించుకున్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రధానంగా రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్ పై చర్చాగోష్టిలో సమగ్రంగా తెలిపారు.

✅ “నిరుద్యోగ యువత ప్రాధాన్యతగా అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ ప బ్లిక్ స ర్వీస్ క మిష న్ పున రావాస కేంద్రంగా ఉండ కూడ దని భావించి యూపీఎస్సీ ఛైర్మ న్ , ఇత ర స భ్యుల ను క లిసి చ ర్చించా. యూపీఎస్సీ ఎలా ప ని చేస్తుందో తెలుసుకున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా నియామ క ప్ర క్రియ ఎలా చేప డ తారో తెలుసుకున్నా. దాన్ని టీజీపీఎస్సీలో అమ లు చేసి 15 నెల ల్లో మేం 67,760 ఉద్యోగాలు భర్తీ చేశాం.

✅ దేశంలోనే అత్యధిక సంఖ్య లో ఉద్యోగాలు ఇచ్చాం. రెండు వారాల కిందట కూడా నోటిఫికేష న్లు ఇచ్చాం. త్వ ర లోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామ కాల నోటిఫికేష న్ ఇవ్వ బోతున్నాం అని వెల్లడించారు.

రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పులు. గతంలో మహారాష్ట్ర, తర్వాత తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు జరిగేవి. నేను అధికారంలోకి వ చ్చిన తర్వాత 25,035 రైతు కుటుంబాల కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల ను మాఫీ చేశా. ఇది దేశంలోనే అత్య ధిక రుణ మాఫీ.

✅ 2024-25 సంవ త్స రంలో రైతు ఆత్మ హ త్య లు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్ సీఆర్ బీ నివేదిక పేర్కొంది. ఎన్ సీఆర్ బీ కేంద్ర ప్ర భుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైతులు ఇప్ప టి వ ర కు క నీస మ ద్ద తు ధ ర (MSP) కోసం పోరాడారు.. నేను ఎమ్మార్పీ ఇవ్వ డంతో పాటు ధాన్యం రైతుల కు క్వింటాలుకు రూ. 500 బోన స్ ఇచ్చాను.

✅ ధాన్యం సేక ర ణ ను కేంద్రం ప ట్టించుకోవ డం లేదు. ఎమ్మార్పీ ప్ర క టించి చేతులు దులుపుకోవడం సరికాదు. తెలంగాణలో ధాన్యం, మొక్క జొన్న తో పాటు ఇత ర పంట లు సేక రిస్తున్నాం. రైతు భ రోసా కింద ఎక రాకు రూ.12 వేలు ఇస్తున్నాం.. వాటిని రైతులు ఎరువులు, పెట్టుబ డికి ఉప యోగిస్తున్నారు.

✅ మ హిళా సాధికారిత కు మేం చేస్తున్న కృషిలో భాగంగా తెలంగాణ లోని స్వ యం సహాయ క సంఘాల్లోని 67 ల క్ష ల మంది మ హిళ లకు సున్నా వ డ్డీతో 60 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఆ వ డ్డీల ను మేం క డుతున్నాం. మ హిళా సంఘాలు 1000 బ స్సులు కొనుగోలు చేశారు.

✅ పున రుత్పాద క ఇంధ న రంగంలోకి మా మ హిళా సంఘాలు వ చ్చాయి. వాళ్ల కు పెట్రోల్ బంక్ లు ఇచ్చాం. సోలార్ ప్లాంట్లు ఇచ్చాం. ప్ర తి ప్ర భుత్వ సంస్థ వ ద్ద మా మ హిళా సంఘాల స భ్యులు క్యాంటీన్లు న డుపుతున్నారు. ప్ర భుత్వ పాఠ శాల ల్లో వ స తుల క ల్ప న మ హిళా సంఘాలకు అప్ప గించాం. వాళ్లు సంతోషంగా ఉన్నారు.

✅ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకు సమ గ్ర మైన ప్ర ణాళిక ఉంది. 160 కిలోమీట ర్ల ఔట ర్ రింగు రోడ్డు ప రిధిలోని న గ ర ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బ న్ రీజియ న్ ఎకానమీ), ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) మ ధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బ న్ రీజియ న్ ఎకాన మీ), ఆర్ఆర్ఆర్ వెలుప ల ప్రాంతాన్ని రేర్ (రూర ల్ అగ్రిక ల్చ రల్ రీజియ న్ ఎకాన మీ) గా వర్గీకరించి ఆ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం.

✅ గ తేడాది డిసెంబ రు 7, 8, 9 గ్లోబ ల్ సమ్మిట్ నిర్వ హించాం. పాల సీ డాక్యుమెంట్ విడుద ల చేశాం. క్యూర్ లో స ర్వీస్ , ప్యూర్ లో మ్యానుఫ్యాక్చ ర్ , రేర్ లో అగ్రికల్చ ర్ కు ప్రాధాన్యం ఇస్తున్నాం. క్యూర్ ను నెట్ జీరో సిటీగా మార్చ నున్నాం. పాల సీకి త గిన ట్లు ప్ర ణాళిక అమ లు చేస్తున్నాం. ఏడాదికి రూ. 2000 కోట్లు న ష్ట పోతున్నా మేం క్యూర్ ప రిధిలో ఈవీ వాహ నాల నే వాడాల ని నిర్ణ యించాం. అందుకోసం ఈవీ వాహ నాల పై ట్యాక్స్ ఎత్తివేశాం. మెట్రో విస్త ర ణ చేప డుతున్నాం.

✅ హైదరాబాద్ లో చెరువుల ఆక్ర మ ణ లు తొల గించి వాటి పున రుద్ధ ర ణ చేప డుతున్నాం. వాట ర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. ప్యూర్ పరిధిలో మ్యానుఫాక్చ ర్ రంగాన్ని ప్రోత్స హిస్తున్నాం. మేం 30 వేల ఎక రాల్లో భార త్ ఫ్యూచ ర్ సిటీని నిర్మిస్తున్నాం. ఇక్క డ ఫార్చూన్ -500 కంపెనీలు పెట్టుబ డులు పెట్టేలా ఆహ్వానిస్తున్నాం.

✅ తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం లేదని, చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీల పురోగతి గమనించిన తర్వాత వాటితో పోటీపడుతున్నాం. పెట్టుబడులకు చైనా+1 గమ్యస్థానాల గురించి ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ పోటీపడుతోంది.

✅ నేను ఎవ రి ద గ్గ రైనా సరే నేర్చుకోవ డానికి ఇబ్బంది ప డ ను. సాగునీటి ప్రాజెక్టు ద గ్గ ర కు వెళితే అసిస్టెంట్ ఇంజినీర్ ద గ్గ ర నుంచి తెలుసుకోవ డానికి కూడా మోహ మాటప డ ను. ఎందుకంటే ఆయ నకే అస లైన స మ స్య తెలుసు. దానిని ఎలా ప రిష్క రించాలో తెలుసు. త్వ ర లోనే నేను చైనా సంద ర్శిస్తా. నేను నేర్చుకుంటా. హార్వ ర్డ్ లో ప ది రోజులు కోర్సు చేశా. చైనాను సంద ర్శించి ఉత్త మ మైన ప ద్ధ తుల ను తెలుసుకుంటా.

✅ నేను 2006 నుంచి 2023 వ ర కు 17 ఏళ్లు ప్ర తిప క్షంలో ఉన్న సమయంలో ఎంతో తెలుసుకున్నా. ప్ర జా స మ స్య పై పోరాడా. అందుకే న న్ను త ప్పుదోవ ప ట్టించలేరు. చిన్న రైతు, నిర క్ష రాస్యులు సైతం త మ ద గ్గ ర ఉన్న స మాచారంతో త న కామ న్ సెన్స్ తో ప రిష్కారం చూపుతారు. ప రిపాల న లో కామ న్ సెన్స్ అతి ముఖ్య మైన అంశం. మీడియాలో వచ్చే వార్తలు బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తా.

✅ గ తంలో రాష్ట్రాన్ని పాలించే అవ కాశం వ చ్చిన వారు పాల కులుగా భావించారు. నేను సేవ చేయ డానికి వ చ్చిన ప్ర జా ప్ర తినిధిగా భావించా. సామాన్యుల స మ స్య లు ఏమిటో అర్థం చేసుకున్నాను. ప్ర త్యేకించి యువ త , రైతు కూలీలు, మ హిళ ల స మ స్య లు తెలుసుకున్నా.

✅ నా రాజ కీయ జీవిత మంతా ప్ర జ లు, సామాన్యుల కోసం పోరాడా. నాకు ఎటువంటి రాజ కీయ నేప థ్యం లేదు. ఎటువంటి మ ద్ద తు లేదు. నేను వ్య వ సాయ కుటుంబం నుంచి వ చ్చా. మాది వ్య వ సాయ కుటుంబం. తెలంగాణ ప్ర జ ల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వ చ్చా” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

The Hon’ble Chief Minister participated in The Hindu Huddle, a discussion forum organized by The Hindu newspaper in Bengaluru. Responding to a wide range of questions posed by The Hindu Director, N. Ram, the Chief Minister elaborated on Telangana’s development plans as well as various political, social, administrative, and personal issues.

Source: I&PR TelanganaRead on I&PR Telangana →

More News